ప్రస్తుతం దేశంలో అత్యంత వివాదాస్పదమైన చిత్రంగా ది కేరళ స్టొరీ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో వాస్తవాలు వక్రీకరించారని ముస్లిం సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. మరో వైపు హిందుత్వ వాదులు, సంస్థలు మద్దతుగా నిలబడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ పార్టీ కూడా ది కేరళ స్టొరీ మూవీకి సపోర్ట్ చేయడం విశేషం.
ఇలా వివాదాల నడుమ థియేటర్స్ లో ఈ మూవీకి ఒక వర్గం ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ గ్రాస్ క్లబ్ లో చేరిపోవడం విశేషం. దీనిని బట్టి సినిమాకి ఏ స్థాయిలో స్పందన వస్తుందో అంచనా వేయవచ్చు.
మొదటి రోజు ఈ చిత్రానికి 8.03 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే రెండో రోజుకి ఊహించని విధంగా కలెక్షన్స్ పెరిగిపోవడం విశేషం. ఏకంగా 11.22 కోట్ల గ్రాస్ ని సెకండ్ డే ది కేరళ స్టొరీ కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో 16.40 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ సంచలనం సృష్టించింది. నాలుగో రోజు 10. 07 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం రాబట్టింది. ఐదో రోజు మళ్ళీ పెరిగి 11.14 కోట్లు కలెక్షన్స్ సాధించింది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని నిషేధించారు. లేదంటే ఇంకా ఈ కలెక్షన్స్ ఫిగర్స్ ఎక్కువగా ఉండేవనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ మూవీ 56.86 గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
మరో వైపు ఈ మూవీపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అసలు స్టార్ క్యాస్టింగ్ లేకుండానే ఫిమేల్ సెంట్రిక్ కాన్సెప్ట్ తో వచ్చి ఈ ది కేరళ స్టొరీ ఈ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతూ ఉండటానికి కారణం మూవీ చుట్టూ అలుముకున్న వివాదాలే అని చెప్పాలి.