రెమ్యూనరేషన్ విషయంలో ప్రభాస్ ను వెనక్కి నెట్టిన ఐకాన్ స్టార్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు హీరోలకు కేవలం ఐదారు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఉండేది. అయితే పలు సూపర్ హిట్ సినిమాలలో నటించడం వల్ల వీరి రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ వచ్చింది.అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావడంతో ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఇలా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిపోయింది. ఇక బాహుబలి తర్వాత ఈయన నటించిన సినిమాలకు ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాని ఏకంగా 350 కోట్ల బడ్జెట్ కేటాయించి సినిమాని నిర్మిస్తున్నారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.పుష్ప సినిమాకు 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ సీక్వెల్ సినిమాకి మాత్రం 100 కోట్లు తీసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి.ఇలా ఈయన 100 కోట్ల రెమ్యూనరేషన్ అనగానే ప్రభాస్ కి పోటీగా అల్లు అర్జున్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని భావించారు.అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ప్రభాస్ ని వెనక్కి నెట్టి అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప 2కోసం అల్లు అర్జున్ ఏకంగా 125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొనున్నట్లు సమాచారం.ఇలా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని తొలి సౌత్ హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించారు.