Veda Archana : రాజమౌళి రెండు బ్లాకబస్టర్ సినిమాల్లో అవకాశం వదులుకున్న అమ్మడు…ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా..!

Veda Archana : నేను, నువ్వొస్తానంటే నేనొద్ధంటానా సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు పొందిన వేద అర్చన హీరోయిన్ గా మాత్రం మంచి హిట్లు అందుకోలేదు. కన్నడ, మలయాళం, తమిళం భాషలలో మొత్తం 40 కి పైగా సినిమాలు చేసింది అర్చన. ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా మెరిసిన అర్చన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఇక తన జీవితంలో తాను చేజార్చుకున్న అవకాశాలను ఇటీవలే చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

రాజమౌళి తీసిన మగధీర ఎంత పెద్ద హిట్ సినిమానో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ పోషించిన మిత్రవింద పాత్రకూడా బాగా పాపులర్ కాజల్ కెరీర్ ఈ సినిమాతో బాగా మలుపు తిరిగి స్టార్ హీరోయిన్ గా మారిపోయిందనే చూపొచ్చు. ఇలాంటి మిత్రవింద పాత్ర తొలుత అర్చనకే వచ్చిందట. కానీ అర్చన వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను వదులుకుందట. ఇక ఆ తరువాత రాజమౌళి తీసిన మర్యాద రామన్న సినిమాలో సలోని పాత్రకూడా మొదట అర్చనే అనుకున్నారట కానీ అర్చన ఆ అవకాశాన్ని కూడా చేజార్చుకుంది.

ఒకవేళ ఆ పాత్రలో ఏదో ఒక దానిలో వేద అర్చన చేసుంటే అర్చన కెరీర్ మరోలా ఉండేది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ తన దగ్గరకు వచ్చిన బంగారు అవకాశాలను వదులుకుని అర్చన ఇపుడు బాధపడుతోంది.ఎన్నో అవకాశాలను అందుకున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక వదులుకోవడంతో ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్నాను అంటూ తెలిపింది.