టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల “అశోకవనంలో అర్జున కళ్యాణం” సినిమా ద్వారా హిట్ అందుకున్న విశ్వక్.. “ఓరి దేవుడా” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఊహించిన ఊహించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ ముఖ్యపాత్రలో లాయర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విశ్వక్ సేన్ గురించి ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో విశ్వక్ సేన్ నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల అయింది. విశ్వక్ సేన్ 11వ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని హోంబ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌పై అర్జున్ తెరకెక్కిస్తున్నాడు . ఇక ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి విశ్వక్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా విశ్వక్ ఈ సినిమాలో నటించనని చెప్పటంతో విశ్వక్ సేన్ పై ఫిల్మ్ ఛాంబర్ లో అర్జున్ కంప్లైంట్ చేయబోతున్నారని సమాచారం. అసలు ఇలా విశ్వక్ సేన్ మీద అర్జున్ ఎందుకు కంప్లైంట్ చేయాలనుకున్నాడు…అసలు ఇద్దరిమద్య ఏం గొడవ జరిగింది అన్న విషయాల గురించి ఇప్పటివరకూ సమాచారం అందలేదు. అయితే అర్జున్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేస్తాడా ? లేక ఇద్దరూ చర్చించుకొని ఈ సమస్యని పరిష్కరించుకుంటారో చూడాలి మరి.