అనుష్క తో నటించకూడదని ఆ స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన కుటుంబసభ్యులు…?

సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క గురించి తెలియని వారంటూ ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందిన అనుష్క అరుంధతి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. అరుంధతి సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటించటానికి అనుష్క కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని ఆకట్టుకుంటుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో అనుష్క హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

అయితే చాలా కాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం అనుష్క కేవలం ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనుష్కకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఉన్నాయంటూ రూమర్లు వినిపించడం చాలా సహజం. అనుష్క విషయంలో కూడా చాలా కాలంగా ఇలాంటి రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ అనుష్క ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని… వీరిద్దరూ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రభాస్ తో కన్నా ముందు గోపీచంద్ అనుష్క మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. లౌక్యం సౌర్యం వంటి వరుస సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించడం వల్ల వీరిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉందని రూమర్లు వినిపించాయి. అంతేకాకుండా ఒక సినిమాలో అనుష్క ఎక్స్పోజింగ్ చేయడానికి రెడీ అయితే గోపీచంద్ ఫోన్ చేసి మరి అలాంటి పాత్రల్లో నటించద్దు అని వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయం గోపీచంద్ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని భావించిన కుటుంబ సభ్యులు గోపీచంద్ తో గొడవకు దిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా గోపీచంద్ అనుష్క కాంబినేషన్లో ఒక సినిమా ఆఫర్ వచ్చినా కూడా గోపీచంద్ కుటుంబ సభ్యులు ఆమెతో నటించటానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.