Hero Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయనకు తమిళంలో ఎంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సూర్య తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఈ వివాదం తన వ్యక్తిగత విషయాల గురించి మాత్రం కాదు తాను నటించిన సినిమాలు ఏదో ఒక వివాదానికి కారణం అవుతూ సూర్య కూడా ఆ వివాదంలో నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే గతంలో సూర్య నటించిన జై భీమ్ చిత్రం ఎన్నో వివాదాలకు కారణమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయం మర్చిపోకముందే సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో నటించిన ఈటీ ఈ సినిమా ఈ నెల 10వ తేదీ విడుదల అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా మరో వివాదంలో ఇరుక్కుంది.ఈ సినిమాను పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్ సంఘంకు చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాలో అభ్యంతరమైన సన్నివేశాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే విధంగా ఈ సినిమా తమిళనాడులోని కడలూరు, విల్లుపురం జిల్లాలో విడుదల కాకూడదని కడలూరు కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ క్రమంలోనే సూర్య నటించిన ఈ సినిమా ఇంతటి వివాదానికి కారణం కావడంతో ఆయన ఇంటి దగ్గర ఏ విధమైనటువంటి ఆందోళనలు జరగకుండా అలాగే అతని ఇంటిపై దాడి చేయకుండా ఉండటం కోసం చెన్నై పోలీసులు సూర్య ఇంటి చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు.