ఈ 4 సినిమాల బిజినెస్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

ప్రతి శుక్రవారం టాలీవుడ్ ఇండస్ట్రీకి సినిమా డే అని చెప్పాలి. ఆ రోజు కచ్చితంగా మినిమమ్ ఒక్క సినిమా అయిన ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి ఒక శుక్రవారం వస్తుంది అనే సామెత టాలీవుడ్ ఇండస్ట్రీలో భాగా ప్రాచూర్యంలో ఉంది. అలాగే మే 26న కూడా చాలా సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.

అయితే ఈ సారి పోటీలో పెద్ద సినిమాలు అయితే ఏవీ లేవు. కాని చిన్న సినిమాలలో మంచి బజ్ ఉన్నవి రిలీజ్ అవుతున్నాయి. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరిని చేరువ అయ్యే కథలతో దర్శక, నిర్మాతలు తమ అదృష్టం పరీక్షించుకోవడానికి వస్తున్నారు. వీటిలో నరేష్, పవిత్ర లోకేష్ మళ్ళీ పెళ్లికి కొంత హైప్ ఉంది.

అలాగే సుమంత్ ప్రభాస్ హీరో కమ్ దర్శకుడిగా చేస్తోన్న మేమ్ ఫేమస్ మూవీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ 2018 గీతా ఆర్ట్స్ నుంచి తెలుగులో డబ్బింగ్ అయ్యి ప్రేక్షకుల ముందుకి వస్తోంది. నరేష్ అగస్య, బ్రహ్మాజీ, వైవాహర్ష కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా మెన్ టూ మూవీ రిలీజ్ అవుతోంది.

ఈ నాలుగు సినిమాలు కలిపి సుమారు 200 థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. మేమ్ ఫేమస్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్టిబ్యూట్ చేస్తోంది. మిగిలిన సినిమాలన్నీ సొంతంగానే నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ పెళ్లి సినిమా బిజినెస్ వేల్యూ మొత్తం 1.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా, దీంతో ఈ సినిమాకి 1.6 షేర్ వస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మెన్ టూ కూడా దాదాపు అదే రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవాలి.

ఇక మేమ్ ఫేమస్ మూవీ బిజినెస్ 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 2.2 కోట్ల షేర్ రాబడితే ఈ సినిమా హిట్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. ఇక డబ్బింగ్ మూవీ 2018 మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా 1.8 కోట్ల బిజినెస్ వేల్యూతో రిలీజ్ అవుతోంది. 2 కోట్ల బ్రేక్ ఎవెన్ వస్తే హిట్ బొమ్మగా మారినట్లే. మరి ఈ చిత్రాలలో ప్రేక్షకులని మెప్పించేవి ఏవి అవుతాయనేది చూడాలి.