టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో స్నేహారెడ్డి తరచు ఫోటోషూట్లు చేయించుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే సోషల్ మీడియా వేదికగా స్నేహ రెడ్డి తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా ఈమెకు సోషల్ మీడియాలో ఏకంగా హీరోయిన్లకు మించిన పాపులారిటీ ఉంది. ఇకపోతే తాజాగా ఈమె వెండి రంగు చీరలో దేవకన్యలా మెరిసిపోతూ ఫోటోషూట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది అభిమానులు స్నేహారెడ్డి కట్టుకున్న చీర గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు.
ఈ ఫోటోలలో స్నేహ రెడ్డి కట్టిన చీర ధర ఎంత ఉంటుంది అంటూ ఆరా తీస్తున్నారు. ఈ ఫోటోలలో ఈమె కట్టిన చీరను ప్రముఖ డిజైనర్ డిజైనర్ రిమ్జిమ్ దాదు రూపొందించిన ఈ చీరను మెటాలిక్ కార్డ్స్‌తో తయారు చేశారు. ఇలా ఎంతో స్టైలిష్ గా ఉన్నటువంటి ఈ చీర ఖరీదు కూడా ఆకాశాన్ని అంటుతుంది. ఈ ఫోటోలలో స్నేహ రెడ్డి ధరించిన చీర ఖరీదు రూ.1,76,000 అని తెలుస్తోంది. ఈ విధంగా ఈమె ధరించిన చీర ఖరీదు తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.