టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమెను అల్లు అర్జున్ ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత స్నేహ రెడ్డి సినిమాలలో చేయకపోయినప్పటికీ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుందని చెప్పాలి.అల్లు అర్జున్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడం వల్ల ఈమె తన పిల్లలకు సంబంధించిన విషయాలలో తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించడమే కాకుండా తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండు. హీరోయిన్లతో సమానంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈమె నిర్వహించే ఫోటోషూట్ లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. చాలా స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్ కి పోటీగా ఈ ఫోటో సెషన్ నిర్వహిస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా తన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈమెకు అభిమానులు పెరిగిపోయారు. అయితే ఇలా అల్లు స్నేహారెడ్డి ఫోటో సెషన్ నిర్వహించడానికి ఓ కారణం పొందని తెలుస్తోంది.
అల్లు స్నేహ రెడ్డి తండ్రి హైదరాబాదులో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తూ పలు వ్యాపారాలను చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే స్నేహ రెడ్డికి మాత్రం హీరోయిన్ కావాలని కోరిక బలంగా ఉండేదట. ఈ విషయమే తన తండ్రి వద్ద ప్రస్తావించగా తనని హీరోయిన్ చేయడం కోసం తన తండ్రి ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక తన కోరికను వదులుకున్నారు.అయితే ఈమె ఊహించని విధంగా అల్లు అర్జున్ ప్రేమించి సిని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఇంటికి కోడలుగా రావడంతో మరోసారి తన హీరోయిన్ అవ్వాలని కోరికను తీర్చుకోవడం కోసం ఇలా హీరోయిన్ రేంజ్ లో ఫోటోలకు ఫోజులిస్తూ తన కోరికను తీర్చుకుంటున్నారట.అందుకే నిత్యం పలు స్టైలిష్ డిజైనర్ వేర్ ధరిస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు.