స్టోరీ వినకుండానే రవితేజ సినిమాను రిజెక్ట్ చేసిన నటి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో?

మాస్ మహారాజ రవితేజ తాజాగా ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.త్రినాధ్ రావు దర్శకత్వంలో శ్రీ లీల రవితేజ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందుగా డైరెక్టర్ త్రినాథ్ రావు ఈ సినిమాలో శ్రీ లీలను హీరోయిన్గా ఎంపిక చేయలేదని సమాచారం.

రవితేజ తో కలిసి పలు సినిమాలలో నటించి మెప్పించిన నటి హన్సికను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్టర్ భావించారట. ఈ క్రమంలోనే ఆమెను అప్రోచ్ అయ్యి ఈ విషయాన్ని చెప్పడంతో హన్సిక కనీసం సినిమా కథ కూడా వినకుండా సినిమాని రిజెక్ట్ చేయడం రవితేజకు చాలా బాధ కలిగించిందని ఒకానొక సమయంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని తెలుస్తుంది. అయితే హన్సిక రవితేజకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. అయితే హన్సిక మాత్రం రవితేజతో నటించడానికి రిజెక్ట్ చేయడంతో ఆయన చాలా బాధపడ్డారని తెలుస్తోంది.

నిజానికి హన్సికను ఈ సినిమా కోసం డైరెక్టర్ ను కలిసినప్పుడు ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని ఒకవేళ ఈ సినిమాకు కమిట్ అవుతే తన పెళ్లి పనులను చూసుకునే తీరిక ఉండదన్న ఉద్దేశంతో సినిమా కథ కూడా వినకుండా రిజెక్ట్ చేశారట. లేకపోతే ఈ సినిమాలో శ్రీ లీల స్థానంలో హన్సిక నటించాల్సి ఉంది. అయితే అనంతరం ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి చిత్ర బృందం తిరిగి ఈ సినిమాలో శ్రీ లీలను ఎంపిక చేశారు. మరి హన్సిక స్థానాన్ని కొట్టేసిన శ్రీ లీల ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.