సినిమా కెరియర్ లో ఎన్ని ఫ్లాప్స్ ఎదురైనా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తూ అదే కెరియర్ లో కొనసాగాలని చూస్తారు చాలామంది నటీనటులు. అలాంటిది ఒక నటుడు వస్తూ వస్తూనే మంచి హిట్ అందుకొని అతి తక్కువ వ్యవధిలోనే స్టార్ హోదా దక్కించుకొని అంతలోనే సినిమాలకి ముగింపు పలుకేస్తున్నానంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తుంది. ఇంతకీ ఎవరు ఆ నటుడు, ఎందుకు కెరీర్ కి ముగింపు పలుకుతున్నాడో చూద్దాం. విక్రాంత్ మస్సే అంటే తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు.
కానీ 12 ఫెయిల్ హీరో అంటే అందరికీ తెలుస్తుంది. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధ జోషిల జీవిత కథ ఆధారంగా రూపొందించిన ట్వెల్త్ ఫెయిల్ చిత్రంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్న నటుడు విక్రాంత్ మస్సే. ఈ సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. సూపర్ హిట్ సినిమా ది సబర్మతి రిపోర్టులో జర్నలిస్ట్ గా మంచి పాత్ర పోషించి అందరి మన్ననలు పొందాడు.
ఇంకా అతనితో సినిమాలు తీయటానికి చాలా మంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయినప్పటికీ తన కెరియర్ని ముగించాలనుకున్న విక్రాంతం తన ఇన్స్టాగ్రామ్ లో డిసెంబర్ ఒకటిన ఒక పోస్ట్ పెట్టారు. కొన్ని సంవత్సరాలుగా మీరందరూ నాపై చాలా ప్రేమను చూపించారు, ప్రతి ఒక్కరు నాకు చాలా మద్దతు ఇచ్చారు. మీ అందరికీ నా ధన్యవాదాలు ఒక భర్తగా తండ్రిగా ఇప్పుడు నేను నా కుటుంబానికి పూర్తి సమయం కేటాయించవలసిన టైం వచ్చింది దీంతో సినిమాలను అంగీకరించడం లేదు.
2025లో రానున్న సినిమానే నా చివరి సినిమా అవుతుంది. చివరిసారిగా మనం 2025లో కలవబోతున్నాం చివరి రెండు సినిమాలతో నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చారు మీ అందరికీ కృతజ్ఞతలు విక్రాంత్ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాడు. అని ప్రకటించడంతో షాక్ అవ్వటం అభిమానుల వంతు అయింది. కెరియర్ పీక్లో ఉండగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక మరేమైనా కారణాలు ఉన్నాయా అని అన్వేషిస్తున్నారు ఆయన అభిమానులు.