హైదరబాద్ లో ఇల్లు కొంటోన్న టాప్ హీరోయిన్ ? ఈమె దిగితే మిగితా హీరోయిన్ ల పరిస్థితి ఏంటి ?

టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన పలువురు ముంబై మోడల్స్..ఇక్కడ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత ఇక్కడే ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేయడమో లేక భారీ ఖర్చు చేసి ఓ విల్లా కొనుక్కోవడమే చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడే సెటిలవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. అలానే ప్లాన్ చేసుకున్న హీరోయిన్స్ కూడా ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే. మంగుళూరు బ్యూటీ అనుష్క శెట్టి… దిల్లీ బ్యూటీస్ రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా.. ఉత్తరాఖండ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి.. లా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న వాళ్ళు హైదరాబాద్ లో సెటిలైన సంగతి తెలిసిందే.

Avika Gor | Telugu Rajyam

ఇక్కడే సొంతంగా పలు అపార్ట్ మెంట్స్.. విల్లాలు కొనుక్కున్నారని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో మరో యంగ్ బ్యూటీ అవికా గోర్ చేరిందని తాజా సమాచారం. ఈ యంగ్ బ్యూటీ కూడా హైదరాబాద్ లోనే సెటిలవ్వాలని ప్లాన్ చేసుకుంటుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలనటిగానే ఈ అమ్మడు బాగానే సంపాదించుకుంది. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా తర్వాత కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేసి బాగానే కూడపెట్టుకుందట.

అంతేకాదు గత కొంతకాలంగా రేస్ లో వెనకబడిన అవికా గోర్ ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒక సినిమాకి నిర్మాతగానూ మారబోతోందని సమాచారం. సాయి రోనాక్ హీరోగా నటిస్తున్న ఒక తెలుగు సినిమాలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తూనే నిర్మాణంలో భాగ స్వామిగా కూడా వ్యవహరిస్తుందట. చెప్పాలంటే ఇంకా హీరోయిన్ గానే సరిగ్గా అవకాశాలు లేవు. ఇలాంటి సమయంలో డేర్ చేసి నిర్మాణం లో భాగస్వామిగా అంటే అవికా డేర్ స్టెప్ వేస్తున్నట్టే అంటున్నారు. చూడాలి మరి ఈ యంగ్ బ్యూటి నిర్మాతగా ఎంతవరకు సక్సస్ అవుతుందో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles