Radhe Shyam:దాదాపు మూడేళ్లుగా ఓ పక్క డార్లింగ్ అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా, తదితర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్స్, మేకింగ్, స్టిల్స్ విడుదల కావడంతో ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగి పోయినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న చిత్ర యూనిట్…ఇటీవలే ప్రమోషన్స్‌తో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రభాస్ , పూజా హగ్దేలు ముంబైలో చక్కర్లు కొడుతూ సినిమాకు బజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
కాగా వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిన డైరెక్టర్ రాధాకృష్ణ తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. ట్రైలర్‌లో కనిపించిన షిప్‌కు సంబంధించిన సీన్ కూడా సినిమా ఆఖరునే ఉంటుందని, ఈ సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ఆ క్లైమాక్స్ పార్ట్ ఒక్కటి మరో ఎత్తు అని ఆయన స్పష్టం చేశారు. రాధే శ్యామ్ చిత్రానికి దాదాపు సంవత్సరం పాటు ప్రొడక్షన్ వర్క్ నడిస్తే, ఆ ఒక్క క్లైమాక్స్ పార్ట్‌కే ఆల్మోస్ట్ 5 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అంతే కాకుండా ఈ మూవీలో అత్యంత నచ్చిన, ఆసక్తి కరమైన సీన్ కూడా తనకు అదేనని ఆయన వివరించారు.
డైరెక్టర్ చెప్పినట్టు ఆ క్లైమాక్స్ సీన్ అంత బాగుంటుందా? ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మార్చి 11 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ వర్లాలు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులను ఈ చిత్రం ఆదరిస్తుందని ఆశిద్దాం.