చిరు – శ్రీదేవి.. మధ్యలోనే ఆగిపోయిన ఆ ఒక్క సినిమా

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు దాదాపుగా సౌత్ ఇండియాలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారుండరు. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్ మొదలైన కొత్తలో అవకాశాల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేరుగా హీరోగా కాకుండా విలన్ గా కూడా నటించాడనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.

కానీ ఆ తర్వాత క్రమక్రమంగా అవకాశాలు దక్కించుకోవడం, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి సఫలీకృతం అయ్యాడు. దీంతో దాదాపుగా రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని శాసించాడని చెప్పవచ్చు. అంతేకాదు ఎంతోమంది చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా మంచి సక్సెస్ సాధించారు.

అయితే 150 కి పైగా చిత్రాలలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో కూడా కొన్ని చిత్రాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని దాదాపుగా చాలామందికి తెలియదు. ఈ క్రమంలో దర్శక నిర్మాతలు ఓకే చెప్పి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయిన తర్వాత బడ్జెట్ సరిపోకపోవడం లేదా పలు ఇతర కారణాలు కారణంగా మెగాస్టార్ కెరియర్ లో దాదాపుగా పదికి పైగా చిత్రాలు ఆగిపోయాయి.

ఇందులో వజ్రాల దొంగ చిత్రం ఒకటి. అయితే ఈ చిత్రానికి ప్రముఖ స్వర్గీయ సినీ దర్శకుడు కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ సినీ నిర్మాత నిర్మాతగా వ్యవహరించాడట. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్ గా కూడా ప్రముఖ స్వర్గీయ నటి మరియు మాజీ విశ్వసుందరి శ్రీదేవిని ఎంచుకున్నారట. ఈ క్రమంలో మంచి ముహూర్తం చూసి సినిమా స్టార్ట్ చేశారట.

కానీ కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత పలు అవాంతరాలు ఎదురవడంతో వజ్రాల దొంగ చిత్రం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిందట. అయితే ఇవే కాదు మెగాస్టార్ చిరంజీవి కి సంబందించిన ఆగిపోయిన సినిమాల లిస్టులో వినాలని ఉంది, అబు – బాగ్దాద్ గజదొంగ, ఆటో జానీ, వీటితో పాటు మరో ఆరు చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఈ చిత్రాలన్నీ పట్టాలక్కి విడుదల ఉంటే మాత్రం చిరంజీవి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా సిల్వర్ స్క్రీన్ ని పంచుకున్నాడు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 135కోట్ల రూపాయలకి పైగా కలెక్ట్ చేసింది. కాగా ప్రస్తుతం చిరంజీవి తెలుగులో ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.