దటీజ్ నాని.! చిరంజీవిపై వీరాభిమానం.!

‘దసరా’ సినిమా రిలీజ్ అయ్యాకా, చిరంజీవిని టార్గెట్ చేస్తూ నానిని పొగిడేస్తూ సోషల్ మీడియా వేదికగా చాలా చాలా రచ్చ జరిగింది. ఎన్టీయార్ అభిమానులూ, బాలకృష్ణ అభిమానులూ ఈ రచ్చలో కీలక పాత్ర పోషించారు.

చిరంజీవిని డీగ్రేడ్ చేస్తూ నానిని ఎత్తేసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే చిరంజీవి, నానికి ఆల్ ది బెస్ట్ చెప్పడం.. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకోవడం జరిగింది. కానీ, అవేమీ బయటికి రాలేదు. రానివ్వలేదు.

తాజాగా చిరంజీవి కోసం నాని ఓ స్పెషల్ షో వేయించాడట. సినిమా చూశాకా నానిని తెగ మెచ్చుకున్నాడట చిరంజీవి. చాలా బాగుందని నానితో పాటూ, డైరెక్టర్‌కీ మంచి భవిష్యత్తు వుందని ఆశీస్సులు తెలియచేశాడట.

ఈ నేపథ్యంలో లేటెస్టుగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందించాడు. ‘గాల్లో తేలిపోతున్నా..’ అంటూ చిరంజీవి పొగడ్తలకు ఉప్పొంగిపోయాడు. సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ట్వీట్ వైరల్ అయ్యింది.

ఇంతవరకూ ‘దసరా’ సినిమాకి సంబంధించి చిరంజీవిపై వచ్చిన నెగిటివిటీకి నాని చెంప దెబ్బ కొట్టినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. దటీజ్ నాని.! చిరంజీవిపై అభిమానం అంటే ఇట్లుంటది.!