“గుంటూరు కారం” కి అడ్డంగా దొరికేసిన థమన్ కాపీ ట్యూన్.!

Thaman-SVP1-1200by667

టాలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది థమన్ ఎస్ ఎస్ అనే చెప్పాలి. తాను ఎప్పుడైతే త్రివిక్రమ్ కాంపౌండ్ వెళ్ళాడో అక్కడ నుంచి థమన్ రూట్ మారింది. చాలా కొత్త ట్యూన్స్ ఇస్తూ వస్తున్న థమన్ మధ్యలో మాత్రం మళ్ళీ తన కాపీ ట్యూన్స్ కూడా వినిపించాడు.

అయితే ఈ ట్యూన్స్ విషయంలో ట్రోల్స్ ని పెద్దగా పట్టించుకోని థమన్ మరోసారి బుక్కయ్యాడు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ లతో మొదటిసారి చేస్తున్న ప్రాజెక్ట్ “గుంటూరు కారం” కూడా ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చూసాడు కానీ అది హిట్ అవ్వకపోగా సోషల్ మీడియా పుణ్యమా అని ఇది కాపీ ట్యూన్ ని ప్రూవ్ అయ్యిపోయింది.

నిన్న మాస్ గ్లింప్స్ లో వినిపించిన ట్యూన్ అయితే తమిళ చిత్రం “కన్మణి రాంబో కతిజ” సినిమా నుంచి థమన్ అయితే లేపేసినట్టుగా ఓ బిట్ ఇపుడు వైరల్ గా మారుతుంది. విజయ్ సేతుపతి మరియు సమంత లపై ఉన్న ఓ సీక్వెన్స్ లో అయితే ఉన్న సేమ్ ట్యూన్ ని నిన్న మహేష్ వీడియో కి తెలుగు లిరిక్స్ తో కొట్టేసాడు.

దీనితో ఈ అచ్చు గుద్దిన కాపీ ట్యూన్ తో అయితే థమన్ దొరికేయగా సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల క్లిప్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. అయితే గతంలో థమన్ పై ఈ తరహా కామెంట్స్ వచ్చినపుడు ఊహించని కొత్త ట్యూన్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచిన సందర్భాలు కూడా లేవు. దానికి బెస్ట్ ఉదాహరణే “గాడ్ ఫాదర్” స్కోర్ అండ్ ఆల్బమ్.