తెలుగు తల్లి సిగ్గుపడుతుంది.. ఎన్టీఆర్ పేరు మార్చడం పై స్పందించిన దర్శకేంద్రుడు!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.ఈ క్రమంలోనే ఎంతోమంది నందమూరి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నందమూరి తారక రామారావు హయామంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పటికీ ఆయన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారిన ఈ పేరును తొలగించలేదు.

ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కొనసాగుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఎంతోమంది ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎంతోమంది రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఖండించారు.ఇకపోతే తాజాగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఎన్టీఆర్ పేరును తొలగించడం పై ఎమోషనల్ అవుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు స్పందిస్తూ… తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటూ ఈ సందర్భంగా రాఘవేంద్రరావు యూనివర్సిటీ పేరు మార్చడం పై స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ విషయంపై నందమూరి కళ్యాణ్ రామ్, బాలకృష్ణ,ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా స్పందించిన విషయం మనకు తెలిసిందే.