పుష్ప 2 టీం కి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ గవర్నమెంట్.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా!

పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తూ దేశం మొత్తం తిరుగుతున్నారు పుష్ప 2 మూవీ టీం. అయితే ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆ మూవీ టీం కి మంచి గుడ్ న్యూస్ అందించింది. యాక్షన్ త్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న భారీ ఎత్తున విడుదల కి సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

అంతే కాకుండా డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల బెనిఫిట్ షో తో పాటు అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్ షో ల టికెట్ ధర ఎనిమిది వందలుగా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా సరే 800 టికెట్ ధర నిర్ణయించారు. ఇక అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు.

అలాగే డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లలో టికెట్ రేటు 150 మల్టీప్లెక్స్ లో 200 కి పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో 105 మల్టీప్లెక్స్ లో 150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ లో 20 రూపాయలు మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు పెంపున కి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ధర పెంపుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రేంజ్ లో రేట్లు పెంచితే సామాన్యుడికి సినిమాని దూరం చేయడమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా విడుదలైన పది రోజుల వరకు టిక్కెట్ల పెంపు ఉండటం తో సినీ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.