Telangana: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యకక్షడు ఎవరంటే..?

తెలంగాణ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఎప్పుడో అన్న ఉత్కంఠ కొనసాగుతుండగా.. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అధ్యక్ష నియామకంపై అనవసరంగా పుకార్లు రాయడం, అసత్యాలు ప్రసారం చేయడం ఏం సాధించదని సూటిగా చెప్పారు.

బీజేపీ కేంద్రం చూసుకుంటుందని.. ఇక్కడ ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. అధికారం కోసం కాదండి, దేశం కోసం పని చేసే పార్టీ మనది. ఎవరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్నది అడగవచ్చు, చివరి తీర్పు మాత్రం పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుంది’’ అని బండి సంజయ్ తెలిపారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ పార్టీకి అపకీర్తి తీసుకువస్తే ఉపేక్షించమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వనని BRS చేస్తున్న ఆరోపణలను కూడా బండి సంజయ్ తిప్పికొట్టారు.

గతంలో నాకు, లక్ష్మణ్ గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ ఇదే బీజేపీ. నిజంగా BRS బీసీలకు న్యాయం చేయాలనుకుంటే, తమ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. ఇక్కడ చంద్రబాబు ఎవరు చెప్పారో అన్నది అసలు అంశం కాదు. బీజేపీ ఎప్పుడూ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరు డమ్మీలు కాదు, ఎవరిని ఎక్కడ వినియోగించాలో బీజేపీకి బాగా తెలుసు’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.