మంచి మూడ్‌లో ఉన్నట్టుంది.. తేజస్వీ హాట్ ఫోటోషూట్ వైరల్!!

Tejaswi Madivada latest Photoshoot Goes Viral

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఐస్ క్రీమ్, జతకలిసే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఇలా ఎన్నో చిత్రాల్లో కనిపించి అల్లరి చేసింది తేజస్వీ. అయితే సినిమాల ద్వారా ఎంత పేరు వచ్చిందో.. అంతకు పదింతల క్రేజ్ బిగ్‌బాస్ షో ద్వారా వచ్చింది. అంతటి పాపులార్టీతో పాటే కొంత నెగెటివిటీని కూడా కొనితెచ్చింది. అది ఆమె స్వయంకృతాపరాధమే. ఆమె గొంతు చించుకుని కౌశల్‌ను దూషించడం, ఆరోపణలు చేయడంతో మధ్యలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

Tejaswi Madivada latest Photoshoot Goes Viral
Tejaswi Madivada latest Photoshoot Goes Viral

బిగ్‌బాస్ విషయం కాసేపు పక్కనబెడితే.. తేజస్వీకి సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్తోంది. అయితే తేజస్వీ చేసే వింత వింత ఫోటో షూట్లకు లక్షల మంది ఫిదా అవుతుంటారు.తేజస్వీ నిత్యం బీచ్‌లు, బికినీలు అంటూ విదేశాలబాట పడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఇంటి పట్టునే ఉంటోంది. అయితే ఈ మధ్య మళ్లీ వెరైటీ ఫోటో షూట్లతో విరుచుకు పడుతోంది.

Tejaswi Madivada latest Photoshoot Goes Viral
Tejaswi Madivada latest Photoshoot Goes Viral

రెండు మూడు రోజుల క్రితం రెడ్ డ్రెస్సు, కారులో చేసిన ఫోటో షూట్ రచ్చ రచ్చగా మారింది. ఆ వేడి ఇంకా చల్లారకే ముందే మరో ఫోటో షూట్‌ను రెడీ చేసింది. మూడ్ అంటూ అదిరిపోయే హాట్ పోజులను ఇచ్చింది. పైన వేసుకున్న డ్రెస్‌ను తీసేసి ఇచ్చిన పోజులు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మొత్తానికి తేజస్వీ ఇలా హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తేజస్వీ ప్రస్తుతం కమిట్‌మెంట్ అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది.