టీజర్ టాక్..మళ్ళీ హిట్ కొట్టబోతున్న కిరణ్ అబ్బవరం..??

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ కుదుర్చుకొని నిలబడడం అనేది చాలా తక్కువ మందికే కుదురుతుంది. మరి అలాంటి హీరోలలో వరుస విజయాల హీరో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు.

తన ఫస్ట్ సినిమా రాజా వారు రాణి గారు తో మంచి సక్సెస్ అందుకున్నాక నెక్స్ట్ ఎస్ ఆర్ కల్యాణమండపం తో భారీ హిట్ ని తన కెరీర్ లో వేసుకున్నాడు. ఇక నెక్స్ట్ రీసెంట్ గా సెబాస్టియన్ సినిమాతో ప్లాప్ అందుకోగా గత నెల మళ్ళీ సమ్మతమే సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఇక మళ్ళీ ఈ ఏడాదిలోనే తన మూడో సినిమాని కూడా రిలీజ్ చేసేయడానికి సిద్ధం అయ్యాడు. మరి ఆ సినిమానే “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”. లాస్ట్ ఎస్ ఆర్ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి చిత్ర బృందం ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేయగా ఇది మాత్రం ఆసక్తిగా ఉందని చెప్పాలి.

ఆద్యంతం ఎంటెర్టైనటింగ్ గా ఒకింత స్టైలిష్ గా ఈ టీజర్ అయితే కనిపిస్తుంది. అలాగే బాబా భాస్కర్ మాస్టర్ కూడా కిరణ్ తో సినిమా అంత కనిపించే రోల్ లో ఉండడం మరో హైలైట్ అని చెప్పాలి. అలాగే ఎక్కడా కూడా డైవర్ట్ కాకుండా కంప్లీట్ ఆసక్తిగానే అనిపిస్తుంది.

మరి దీనితో అయితే మళ్ళీ ఇంకో హిట్ తాను అందుకునేలానే కనిపిస్తున్నాడు. ఇంకా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు అలాగే సంజన ఆనంద్, సోను ఠాకూర్ లు హీరోయిన్స్ గా నటించారు.