టీజర్ టాక్ : “ఉగ్రం” లో అల్లరి నరేష్ విశ్వరూపమే.!

ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర కామెడి సినిమాలు అంటే నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత నరేష్ తదితరులు ఓ రేంజ్ లో ఏలారు. ఆ తర్వాత కామెడీ కి పర్ఫెక్ట్ హీరో అంటే అది అల్లరి నరేష్ అని ఓ ముద్ర తనకంటూ ఈ నటుడు వేసుకున్నాడు. కాగా ఇప్పటివరకు 50 పై చిలుకే సినిమాలు చేసిన నరేష్ ఇప్పుడు వాటిని పక్కన పెట్టి మంచి ట్రెండీ కథలతో వస్తున్నాడు.

అలా తాను చేసిన లేటెస్ట్ సినిమాలే అందుకు నిదర్శనం అని చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ లో కూడా కొన్ని డిఫరెట్ సబ్జెక్టు లు చేసాడు కానీ అప్పుడు తన కామెడీ ఇమేజ్ వాటిని తొక్కేసింది. కానీ ఇప్పుడు దర్శకుడు విజయ్ కనక మేడల తో అయితే చేసిన “నాంది” భారీ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా దర్శకుడితో అనౌన్స్ చేసిన మరో లేటెస్ట్ సినిమానే “ఉగ్రం”.

పవర్ ఫుల్ టైటిల్ ని లాక్ చేసిన వీరు సినిమాని కూడా అదే లెవెల్లో ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు వచ్చిన ట్రైలర్ చూస్తే అర్ధం అయ్యిపోతుంది. ఖచ్చితంగా ఈ లెవెల్లో ఈ సినిమా ఉంటుంది అని కూడా ఊహించకపోవచ్చు. ఆ రేంజ్ లో టీజర్ ని మేకర్స్ కట్ చేశారు.

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా అల్లరి నరేష్ మొదటి సారి ఓ సీరియస్ రోల్ లో నటించగా తనపై ఏక్షన్ గాని తన బాడీ కానీ కంప్లీట్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా కూడా ఇందులో కనిపించనున్నట్టుగా కూడా అనిపిస్తుంది.

అలాగే మరోపక్క లాస్ట్ లో అయితే ఇంటెన్స్ ఎమోషన్ తో అక్కడ బూతు డైలాగ్ తప్పదు అన్నట్టుగా నరేష్ పేల్చినా డైలాగ్ కూడా సినిమాలో ఎంత సీరియస్ నెస్ ఉందో తెలుపుతుంది. మొత్తానికి అయితే ఈ టీజర్ లో మాత్రం అల్లరి నరేష్ తాలూకా విశ్వ రూపమే మనం చూడొచ్చు. సినిమా కూడా ఎలా ఉంటుందో చూడాలి. 
Ugram Teaser | Allari Naresh | Mirnaa | Vijay Kanamedala | Sri Charan Pakala | New Telugu Film