Team India: టీమ్ ఇండియా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్‌ను ఖాయం చేసుకుంది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (51) పోరాడినా, భారత బౌలర్ల ధాటికి జట్టు నిలువలేకపోయింది.
భారత బౌలింగ్‌లో హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లో నెట్టారు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి, మధ్య ఓవర్లలో దెబ్బతీశాడు. అక్షర్ పటేల్, అర్ష డీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (23), డకెట్ (39) చక్కటి ఆరంభం ఇచ్చినా, రవి బిష్ణోయ్ మాయాజాలంతో జట్టు దెబ్బతింది.
భారత బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. సంజు శాంసన్ (1), అభిషేక్ శర్మ (29) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యారు. అయితే, శివమ్ ధూబే (53) మరియు హార్దిక్ పాండ్య (53) అర్ధశతకాలతో అదరగొట్టి జట్టును కష్టస్థితి నుంచి బయటపెట్టారు. చివర్లో వీరిద్దరి శతక భాగస్వామ్యమే టీమిండియాకు గెలుపునందించింది. ఈ విజయంతో భారత్ టీ20 సిరీస్‌ను ముందుగానే తన ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్ ఉన్నప్పటికీ, 4-1తో సిరీస్ ముగించాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌పై మరో గెలుపుతో దుమ్మురేపాలని చూస్తోంది.