టీం “ఏజెంట్” ఓవర్ గా పోతున్నారా?

ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లో టాలీవుడ్ దగ్గర అయితే మంచి హైప్ తో ఉన్న చిత్రాల్లో “ఏజెంట్” కూడా ఒకటి. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని నటించాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి కొన్నాళ్ల వరకు కూడా ట్రూ పాన్ ఇండియా హైప్ ని ఈ సినిమా చూసింది.

దీనితో పాన్ ఇండియా లెవెల్లో గట్టి సినిమానే అవుతుంది అనుకుంటే ఈ సినిమా ఇపుడు తెలుగు మలయాళం రిలీజ్ మాత్రమే అవుతుంది. అయితే లాస్ట్ చేసి ఈ సినిమాపై హైప్ ని మేకర్స్ నే కిల్ చేసుకున్నారని చెప్పక తప్పేలా లేదు. మొదట్లో పర్వాలేదు కానీ ఎక్కడ హైప్ పోతుందో ఏమో అని కాస్త ఓవర్ అగ్రెసివ్ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ చేస్తున్నారు.

అందులో అఖిల్ కూడా మామూలు రేంజ్ ఓవర్ యాక్షన్ చూపించట్లేదు. మొన్నేదో ఈవెంట్ లో అయితే స్టేజి పై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా చూస్తుంటే బాగా ఓవర్ అనిపించక మానదు. ఇక మేకర్స్ కూడా ఈ సినిమాని ఒక పోకిరి, బాహుబలి, ఏజెంట్ అంటూ నోటికొచ్చిన మాట అనేస్తున్నారు.

వీటితో ఈ సినిమాపై పాజిటివ్ హైప్ పెట్టుకున్న జెనరల్ ఆడియెన్స్ లో కూడా చిరాకు తెప్పించేలా చేస్తున్నారు. సినిమా బాగుందా లేదా అనేది పక్కన పెడితే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ తగునా? ఏది ఏమైనప్పటికీ మాత్రం ఏజెంట్ టీం మాత్రం బాగా ఓవర్ గానే పోతున్నారు. ఒకవేళ సినిమా ఫలితం గాని ఏమన్నా దెబ్బ పడితే ట్రోల్స్ కి బలైపోక తప్పదు.