అసెంబ్లీ ఘటనపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. ఎంతో బాధ కలిగించిందంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి.ఈ క్రమంలోనే నిన్న జరిగిన అసెంబ్లీ ఘటనలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు అసెంబ్లీ సమావేశంలో టిడిపి నేత చంద్ర బాబు నాయుడు అతని సతీమణి పై అవమానకర మాటలు మాట్లాడారని చంద్రబాబునాయుడు సభ నుంచి వాకౌట్ అవుతూ మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఇప్పటికే నందమూరి బాలకృష్ణ స్పందించగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

నిన్న అసెంబ్లీ ఘటన తనను ఎంతగానో కలిచివేసింది అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. స్త్రీల గురించి పరుషంగా మాట్లాడటం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందని స్త్రీలను గౌరవించడం మన సంస్కృతి అంటూ ఎన్టీఆర్ ఈ ఘటనపై స్పందించారు. ఇకపై ఇలాంటి అరాచక సంస్కృతిని పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించండి రాబోయే తరానికి బంగారు బాటలు వేయండి.ఇది కేవలం ఒక కుటుంబ సభ్యుడిగా మాత్రమే కాకుండా ఒక దేశ పౌరుడిగా ఈ విషయం గురించి స్పందిస్తున్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఘటనపై స్పందించిన తీరు పై పలువురు నెటిజన్లు విభిన్న శైలిలో స్పందిస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఎన్టీఆర్ కు మద్దతు తెలపగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిడిపి అధికారులు ఎంతో మంది మహిళలపై ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేశారు. అదే విధంగా ఎంతో మంది మహిళా ఉద్యోగుల పై దాడి చేశారంటూ గతంలో జరిగిన సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.