బిగ్ అప్డేట్ : “ఉస్తాద్” వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన తమిళ బ్యూటీ.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఈరోజు ఉదయం నుంచే పలు రూమర్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కాగా ఈ సినిమా పైనే ఈరోజు ఉదయం నుంచి అయితే ఓ రేంజ్ లో వార్తలు గాసిప్స్ కొన్ని బయటకి వచ్చాయి.

కొన్ని ట్రస్టడ్ వర్గాలతో అయితే ఈ సినిమాలో కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారగా ఇవి ఇప్పుడు ఏకంగా మాళవిక మోహనన్ వరకు కూడా వెళ్లాయి. కాగా ఈ వార్తలపై అయితే ఆమె బిగ్ అప్డేట్ తో క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఈ సినిమాలో తాను నటిస్తున్న వార్తలు అవాస్తవం అని తేల్చేసింది. పవన్ గారు అంటే నాకూ చాలా ఇష్టం అని కానీ ఈ సినిమా వార్తల్లో నిజం లేదని కన్ఫర్మ్ చేసింది. అంతే కాకుండా తాను ఈ సినిమా కాకుండా టాలీవుడ్ వేరే సినిమాలు చేస్తున్నానని అలాగే వాటిలో కూడా నేను సెకండ్ హీరోయిన్ కాదు మెయిన్ హీరోయిన్ ని అంటూ నొక్కి మరీ చెప్పింది.

అలాగే టాలీవుడ్ లో మంచి సినిమాలతో నేను అడుగు పెట్టబోతున్నానని తెలియజేసింది. దీనితో అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పై వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని మనం అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.