చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం తమన్నా సొంతం. టీనేజ్‌లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా ఇప్పటి వరకు 50కి పైగా సినిమాలలో నటించింది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఇటు తెలుగు ప్రేక్షకులకే కాక తమిళం, హిందీ ప్రేక్షకులని సైతం అలరించింది. తమన్నా అందచందాలకు ముగ్దులు కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సీటీమార్’ చిత్రంలో కబడ్డీ కోచ్‌గా కనిపిస్తుంది. ఇక నితిన్ అందాధున్ రీమేక్ చిత్రంలో కాస్త బోల్డ్‌గా కనిపించనుందట.
కరోనా నుండి కోలుకున్న తర్వాత పలు ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా ఉంటున్న తమన్నా తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమన్నాని చాలా మంది ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. కాని తనని అలా పిలవొద్దంటూ రిక్వెస్ట్ చేసింది. శారీరిక రంగుతో వ్యక్తులకు ముద్దు పేర్లు పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు. మనదేశంలో తెలుపు రంగు చర్మం పట్ల చాలా మందికి వ్యామోహం ఉంటుంది. కొన్ని సార్లు ఇలాంటి పేర్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. టాలెంట్‌ని బట్టి నిక్ నేమ్స్‌తో పిలుచుకోవడం తప్పలేదు కాని, ఇలా శరీర వర్ణంతో పేర్లు పెట్టడం మంచి పద్దతి కాదు అంటుంది తమన్నా
వెబ్ సిరీస్‌ల గురించి కూడా మాట్లాడిన తమన్నా.. ఒకప్పుడు వెబ్ సిరీస్‌లలో నటించేందుకు టాప్ హీరోయిన్స్ అస్సలు ఆసక్తి చూపేవారు కాదు. కాని కరోనా వలన మార్పులు వచ్చాయి. దాంతో చాలా మంది వెబ్‌సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నేను ప్రస్తుతం ‘లెవెంత్ అవర్’ పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నా అని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలంలో అనే చిత్రంలోను నటిస్తోంది. ఈ సినిమా కన్నడ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. హిందీలో బోలే చుడియన్ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో నటిస్తోంది తమన్నా.