రానా దంపతుల‌తో త్వరలో కిక్ ఇచ్చేలా తమన్నాటాక్ షో !

Tamannah Bhatia

తమన్నా తనలోని మాటకారితో అహాలో వచ్చే ఓ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అల‌రించ‌డానికి రెడీ అయిపోతుంది. ఓటీటీల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేపథ్యంలో అల్లు అర‌వింద్‌ తన ‘అహా’  కోసం మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాతో ఓ టాక్ షోను ప్లాన్ చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Tamannaah

అయితే తాజాగా ఇండస్ట్రీ  సమాచారం ప్రకారం త్వరలో స్పెషల్ గా టెలికాస్ట్ అవుతుందట.  కాగా తమన్నా హోస్ట్‌గా ఈ షో ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. అలాగే అభిమానుల‌కు కిక్ ఇచ్చేలా షోకి తమన్నా ఏ రేంజ్ లో క్రేజ్ తీసుకువస్తోందో కూడా చూడాలి.

ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌, రానా దంపతులు, ర‌వితేజ త‌దిత‌ర స్టార్ హీరోల‌తో పాటు హీరోయిన్లు కూడా పాల్గొనబోతున్నారని అప్పుడే రూమర్లు  కూడా వినిపిస్తున్నాయి. మరి తమన్నా త‌న ప్ర‌శ్న‌ల‌తో షోను ఎంతవరకు ర‌క్తి క‌ట్టిస్తుందో చూడాలి.