జస్ట్ పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా.? తమన్నా, విజయ్ వర్మల ప్రేమకథకి సంబంధించి తెర వెనుకాల ఏం జరుగుతోంది.? ఇదంతా ‘లస్ట్ స్టోరీస్-2’ ప్రమోషన్ కోసమేనన్న గుసగుసలు వినిపిస్తున్న దరిమిలా, ఇటు తమన్నా అటు విజయ్.. ఇద్దరూ సీరియస్ అవుతున్నారట. తమ వివాహానికి సంబంధించి అతి త్వరలో క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనతో ఈ ఇద్దరూ వున్నారన్నది తాజా ఖబర్.
పెళ్ళి అప్పుడే కాదుగానీ, త్వరలోనే ఎంగేజ్మెంట్‌తో తమ ప్రేమ బంధాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలని తమన్నా భావిస్తోందట. ‘ఈ ఏడాది చివర్లో తమన్నా, విజయ్ వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు’ అంటూ ఇరువురి సన్నిహితులూ మీడియాకి లీకులు ఇస్తున్నారు.
అయితే, పెళ్ళి విషయమై ఇప్పుడే ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నది తమన్నా, విజయ్ ఇస్తున్న క్లారిటీ.!