టాలీవుడ్ బ్యూటీ తమన్నా తన సెకండ్ ఇన్నింగ్ లో డిఫరెంట్ పాత్రలతో దూసుకుపోతోంది. వచ్చిన ఆఫర్లలో తన నటన కు అవకాశం ఉన్నవాటినే ఎంచుకుంటోంది. నితిన్ ‘అందాదున్’ రీమేక్ లో టబు పాత్రలో చెయ్యడానికి అంగీకరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అది నెగటివ్ షేడ్ ఉన్న మధ్య వయసు మహిళ క్యారెక్టర్. తమన్నా ఛాలెంజ్ కు సిద్ధపడే ఈ పాత్రను ఓకే చేసింది .అలాగే దీనికి కోటిన్నర రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది.
అప్ కమింగ్ హీరో సత్యదేవ్ తో కన్నడ రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. చాలా డెప్త్ తో ఎమోషనల్ గా సాగుతుంది. ఊహించని షేడ్సు ఉంటాయి. రెగ్యులర్ గ్లామర్ పాత్ర కాదు కాబట్టి ఇదీ ఒకరకంగా రిస్కే. హీరో ఎవరు అనేది పట్టించు కోకుండా తమన్నాదీనికి ఓకే చెప్పింది.
ఇక మూడోది.. మరో శాండల్ వుడ్ రీమేక్ ‘ఆ కరాళ రాత్రి’ గురించి వినిపిస్తోంది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ కాన్సెప్ట్ మూవీని తెలుగులో ‘ఆహా’ కోసం ప్రవీణ్ సత్తారు తీయబోతున్నట్టు వినికిడి. థియేటర్ కోసం కాకుండా స్ట్రెయిట్ గా ఓటిటి రిలీజ్ కోసమే దీన్ని తీస్తారట.ఇది తమన్నాను వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఓ మారుమూల పల్లెటూరిలో మూడు లొకేషన్లలో సాగే ఈ చిత్ర కథ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఇందులోనూ ఫిమేల్ లీడ్ నెగటివ్ గానే సాగుతుంది. ఒకవేళ తమన్నా చేస్తే మాత్రం తనకు గుర్తుండిపోయేలా నిలిచిపోవడం ఖాయం.
మొత్తానికి తమన్నా రెగ్యులర్ పాత్రలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ జానర్సు ఎంచుకోవడం మంచి విషయమే. మొత్తానికి కొత్త తరం హీరోయిన్ల కన్నా ఎక్కువ బిజీగా తమన్నానే కనిపించడం విశేషమే. తమన్నా ప్రస్తుతం గోపీచంద్‌తో ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.