వెబ్ సిరీస్‌లోకి మ‌రో హీరోయిన్.. మెల్ల‌గా సినిమాల‌కి సైడ్ ఇస్తుందా?

అనుకోకుండా వ‌చ్చిన అతిథి కరోనా మ‌హ‌మ్మారి. ఇది చేసిన న‌ష్టం అంతా ఇంతా కాదు. ఈ వైర‌స్ వ‌ల‌న ఎన్నో రంగాలు కుదేల‌య్యాయి. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ చాలా నష్టాల‌ని చ‌వి చూసింది. ఎనిమిది నెల‌ల పాటు షూటింగ్స్ ఆగిపోవ‌డం, ఇప్ప‌టికీ థియేట‌ర్స్ తెర‌చుకోక‌పోవ‌డం ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. అయితే థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డంతో ఓటీటీలు ఊపందుకున్నాయి. ఓ వైపు సినిమాలు మ‌రో వైపు వెబ్ సెరీస్‌లు ఇంకో వైపు టాక్ షోస్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని త‌మ వైపుకు తిప్పుకుంటున్నాయి. తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ సంస్థ‌ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించ‌గా, దీనిని జనాల‌లోకి తీసుకెళ్లేందుకు చాలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

అక్కినేని కోడ‌లు స‌మంత‌తో సామ్ జామ్ అనే టాక్ షోని ఆహా కోసం రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షోకు సంబంధించిన వివ‌రాలని ప్రెస్ మీట్ పెట్టి తెలియ‌జేశారు. ఇక ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌గా తెర‌కెక్కిన లెవ‌న్త్‌తో అనే అవ‌ర్‌ని కూడా ఆహాలో విడుద‌ల చేయ‌నున్నారు. దీనికి సంబంధించి కూడా కొద్ది సేప‌టి క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సిరీస్ క‌థాక‌మామీషు ఏంటో వివ‌రించారు. ప్ర‌దీప్ ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించ‌డ‌మే కాక క‌థ కూడా అందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

క‌రోనాని జ‌యించిన త‌మ‌న్నా ట్రీట్‌మెంట్ స‌మ‌యంలో వాడిన మందుల వ‌ల‌న లావెక్కింది. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో త‌మ‌న్నాని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. అయిత రానున్న రోజుల‌లో పూర్వ వైభవం మ‌ళ్ళీ వ‌స్తుంద‌ని అంటుంది మిల్కీ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగులో గోపిచంద్ స‌ర‌స‌న సీటీమార్ అనే సినిమా చేస్తుంది. ఈ పాత్ర‌లో త‌మ‌న్నా ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు