పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్న పొడగరి హీరో.!

ఓ హీరోయిన్‌తో పొడగరి హీరో పెళ్ళంట.. అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ సొట్టబుగ్గల సుందరి ఇప్పటికే ఈ గాసిప్స్‌ని కొట్టి పారేసింది. ఆ పొడగరి హీరో తన పని తాను చేసుకుపోతున్నాడు.

ఇద్దరూ కలిసి గతంలో సినిమాలు చేశారు. ఏమో, భవిష్యత్తులోనూ మరిన్ని సినిమాల్లో కలిసి పనిచేయొచ్చు కూడా. తన కుమారుడి విషయంలో వస్తున్న గాసిప్స్ పట్ల ఆ పొడగరి హీరో తండ్రి కాస్త గుస్సా అవుతున్నాడట. పెళ్ళి చేసేస్తే, ఈ తరహా దుష్ప్రచారానికి తెరపడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘త్వరలోనే అన్ని విషయాలూ వెల్లడిస్తాం..’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆ పెద్దాయన.. కుమారుడి పెళ్ళి ప్రయత్నాల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది. ఓ పెద్ద కుటుంబం నుంచే అమ్మాయిని తీసుకురానున్నారట కోడలిగా.!