తెలుగు తెరపై తాప్సీ చాలా అరుదుగా కనిపిస్తోందిప్పుడు. వాస్తవానికి తాప్సీకి స్టార్‌డమ్ అంటూ మొదలైందే తెలుగు సినిమాల వలన. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో ఒప్పుకుంది.
అయితే, బాలీవుడ్‌లో స్టార్‌డమ్ వచ్చాక, సౌత్ సినిమాని చిన్న చూపు చూడటం మొదలు పెట్టింది తాప్సీ. పరోక్షంగా సౌత్ సినిమా మీద సెటైర్లేయడం, ఆ తర్వాత బుకాయించడం తాప్సీకి అలవాటైపోయింది.
తాజాగా, ఓ సౌత్ నిర్మాత తాప్సీని సంప్రదించాడట.. ఓ కథతో. అయితే, అందులో తనకు హీరోతో సమానంగా.. అంతకు మించి రెమ్యునరేషన్ ఇవ్వాలని తాప్సీ డిమాండ్ చేసిందట.
తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా తెరకెక్కనుందనీ, తమిళంలోనూ ఫాలోయింగ్ వున్న ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో ఆ సినిమా ప్లాన్ చేశారనీ తెలుస్తోంది. తాప్సీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆ నిర్మాత, ఆమెకు గుడ్ బై చెప్పేసి.. వేరే హీరోయిన్‌ని ఎంపిక చేసే పనిలో బిజీగా వున్నాడట.