బిగ్‌బాస్ షోలో మొదటి వారమే ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ మొత్తానికి లైమ్ లైట్‌లోకి వచ్చాడు. సత్యం దర్శకుడు, హీరోయిన్ కళ్యాణి భర్త అంటూ సూర్య కిరణ్‌ను సంబోధించేవారు. అసలు సూర్య కిరణ్ ఉన్నాడా? అనే అనుమానం కూడా కలిగింది. ఇలాంటి ప్రశ్నలకు సమాధనం చెప్పేందుకే తాను బిగ్‌బాస్ షోలో పాల్గొన్నానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భార్య కళ్యాణిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
సూర్యకిరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కళ్యాణి. కొన్నాళ్ల పాటు వీరి బంధ: సాఫీగానే సాగింది. అయితే 2016లో వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో మ్యూచువల్ డైరవ్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భార్యపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు సూర్య కిరణ్.
బిగ్ బాస్‌కి వెళ్లడం ద్వారా కళ్యాణిని మిస్ అవ్వడం కాదు.. ఆమెను రోజూ మిస్ అవుతూనే ఉన్నానని నిర్మోహమాటంగా చెప్పేశాడు.. కళ్యాణి గారూ అంటే నా అమ్మ తరువాత అమ్మ అని, తనకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు వాళ్లను ఎలాగైతే భావిస్తానో కళ్యాణి గారు అన్నా అంతే గౌరవమని చెప్పుకొచ్చాడు.. కళ్యాణి గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. కళ్యాణి గారి కంటే అందంగా తనకు ఎవరూ కనిపించరని తెగేసి చెప్పాడు. ఆమెకు తాను అవసరం లేదని అనిపించిందేమో.. తనకైతే ఆమె ఇప్పటికీ కావాలనే ఉంటుందని మనసులో మాట చెప్పేశాడు.
ఫోన్, ఐపాడ్‌లో అన్నీ కళ్యాణి గారి ఫొటోలే ఉంటాయని, సిగ్గులేదురా.. ఇంకా.. ఆమె ఫొటోలు పెట్టుకున్నావ్ అని మా అమ్మ తిడుతుంటుందని తెలిపాడు. ఆవిడ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు కాని.. కళ్యాణి గారూ చాలా బాగా కనెక్ట్ అయిపోయారని, ఈ జన్మకి తన భార్య అంటే కళ్యాణి మాత్రమే అని మనసులో దాచుకున్న ప్రేమను బయటకు చెప్పేశాడు.