25 ఏళ్ల సినీ జర్నీ పూర్తి చేసుకున్న సూర్య… ఎమోషనల్ పోస్ట్ చేసిన కార్తీ!

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య 1997 నేరుక్కు నేర్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.ఇలా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినటువంటి సూర్య అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు.ఇక ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి కావడంతో తన తమ్ముడు కార్తీ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

సూర్య ఇండస్ట్రీలోకి వచ్చి పాతిక సంవత్సరాలు కావడంతో ఈయన తన సినీ కెరియర్లో ఏకంగా 40 సినిమాలకు పైగా నటించడమే కాకుండా ఎన్నో సినిమాలలో అతిథి పాత్రలో నటించారని, మరి కొన్ని సినిమాలను నిర్మించాలని మనకు తెలిసిందే. ఇలా 25 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సూర్య గురించి తన తమ్ముడు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సూర్యతో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈసందర్భంగా కార్తీక్ పోస్ట్ చేస్తే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడం కోసం అన్నయ్య అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటారని, ఎప్పుడు తన లక్ష్యం వైపు తన దృష్టిని పెట్టి లక్ష సాధన కోసం కృషి చేస్తారని తెలిపారు. తన ఉదార స్వభావాన్ని బయట పెడుతూ కొన్ని వేలమంది భవిష్యత్తును తీర్చి దిద్దిన గొప్ప మనసు నా అన్నయ్యది అంటూ ఈ సందర్భంగా కార్తీ సూర్య గురించి,ఆయన గొప్పతనం గురించి తెలియజేస్తూ తనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు ప్రస్తుతం కార్తీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది సూర్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.