70 కోట్ల ఇల్లు.. సూర్య ఫ్యామిలీలో గొడవ?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానువేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య 42వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య గురించి హాట్ న్యూస్ వినిపిస్తూ వస్తుంది. సూర్య జ్యోతిక ముంబై షిఫ్ట్ పోతున్నట్లుగా ప్రచారం నడుస్తుంది. ఫ్యామిలీతో ఇప్పటివరకు కలిసున్న సూర్య ఇప్పుడు విడిపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముంబైలో ఓ ఖరీదమైన బంగ్లాన్ని కూడా సూర్య కొనుగోలు చేసినట్లుగా టాక్. సుమారు 70 కోట్లతో ఈ భవంతిని సూర్య కొన్నట్లు తెలుస్తుంది.

9వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం గ్రూప్ హౌస్ లో సముదాయంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాంతంలోనే రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఉంటారని తెలుస్తుంది. ఇలాంటి ఖరీదైన బంగ్లా ఇప్పటికే కొనుగోలు చేసిన సూర్య త్వరలో ముంబై షిఫ్ట్ కాబోతున్నాడని కోలీవుడ్లో ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఇక సూర్య ఫ్యామిలీకి దూరంగా ఉండడానికి కూడా కారణం ఇక సూర్య ఫ్యామిలీకి దూరంగాఉండడానికి కారణం అతని భార్య జ్యోతిక అని వినిపిస్తుంది.

ఆమె సినిమాలలో నటించడం సూర్య తండ్రికి ఇష్టం లేదని, దీనిపై వారు అభ్యంతరాలు చెప్పినట్లుగా ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే సూర్య జ్యోతిక ఫ్యామిలీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య నటిస్తున్న 42వ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం విశేషం. దీంతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టాలని నిర్మాత జ్ఞానువేల్ రాజా చూస్తున్నారు.