‎Suriya: హీరో సూర్య కొత్త సినిమా టీజర్ రిలీజ్.. వీడియో వైరల్!

‎Suriya: కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు హీరో సూర్య. అందులో భాగంగానే సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

‎ తమిళంలో బాగానే ఆడిన ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయింది. అంతకుముందు సూర్య నటించిన కంగువ సినిమా పరిస్థితి కూడా ఇదే అని చెప్పాలి. అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్న సూర్య స్పీడ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇకపోతే హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కరుప్పు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇది ఇలా ఉండే తాజాగా హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

Karuppu (Telugu) - Teaser | Suriya | RJB | Trisha | @SaiAbhyankkar | Dream Warrior Pictures

‎అదేమిటంటే.. చిరు సూర్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. కరుప్పు అంటే తమిళంలో నలుపు అని అర్థం. మరి దర్శక నిర్మాతలు ఏం ఆలోచించారో ఏమోగానీ అదే టైటిల్‌ ని యధాతథంగా ఉంచేశారు. టీజర్ చూస్తుంటే కూడా తమిళ ఫ్లేవర్ ఎక్కువగానే కనిపిస్తోంది. కాకపోతే మాస్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్‌ గా చేస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో హీరో సూర్య ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నారు.