సురేఖా వాణి ప్రస్తుతం ఎక్కడుందో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి తన కూతురు సుప్రిత మనాలిలో రచ్చ చేస్తున్నారు. ఆ ఇద్దరి సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయ్యే వారికి వారు ఎంతలా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారో అర్థం అవుతుంది. లాక్డౌన్‌లో కలిగిన ఫ్రస్ట్రేషన్‌ను ఇలా తీర్చేసుకుంటున్నారా? అని అనుమానం వస్తుంది. వెంటవెంటనే ప్రయాణాలు చేస్తూ అక్కడినుంచి ఇంక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అన్నట్టు చక్కర్లుకొడుతున్నారు.
సెప్టెంబర్ నుంచి ఈ ఇద్దరూ బయటకు వెళ్లడం ప్రారంభించారు. మొదటగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న షూటింగ్‌కు వెళ్లారు. అక్కడ దర్గాను కూడా సందర్శించారు. మూవీ సెట్‌లో సుప్రిత కూడా సందడిచేసింది. విజయ్ సేతుపతితో సుప్రిత ఓ సెల్ఫీ దిగి రచ్చ చేసింది. అక్కడి నుంచి వచ్చాక హైద్రాబాద్ సిటీ అవుట్ స్కట్స్‌లో రచ్చ చేశారు. రోడ్డు ట్రిప్ వేసి రిజర్వాయర్ల వద్దకు వెళ్లారు.
ఆ తరువాత హైద్రాబాద్‌లో పబ్బులు, పార్టీలకు వెళ్లారు. ఇక దసరా రోజున గోవాకు వెళ్లి అక్కడ కొన్నిరోజులు ఎంజాయ్ చేశారు. ఆ తరువాత మళ్లీ మనాలికి చెక్కేశారు. ప్రస్తుతం మంచు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మంచు గడ్డల్లా ఉన్న ఆ ప్రాంతాలను చూస్తూ మైమరిచిపోతున్నారు. అసలే చలికాలం. పైగా మంచు కురిసే ప్రాంతంలో చలి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అబ్బా చలి చలి అంటూ వణికిపోతూ ఉన్న వీడియోను సురేఖా వాణి షేర్ చేసింది.