హైద్రాబాద్‌ను వీడిన సురేఖా వాణి.. అక్కడికి చెక్కేస్తోన్న అంటూ పోస్ట్!!

Surekha Vani Travelling Hyderabad To Jaipur

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాల్ తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య టిక్ టాక్ అందుబాటులో ఉన్న సమయంలో అయితే మరింత హంగామా చేసేవారు. తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి డ్యాన్సులు చేసి కుర్రకారుకు మతులు పోగోట్టేవారు. ఇక బెడ్రూంలో కాలా చష్మా అంటూ ఇద్దరూ పొట్టి బట్టలు వేసుకుని డ్యాన్సులు వేసిన వీడియో లీకై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

surekha vani and her daughter supritha
surekha vani and her daughter supritha

ఈ మధ్య సురేఖా వాణి తన కూతురు బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేసింది. ఇక స్పెషల్‌గా ఈవెంట్ మేనేజర్‌లతో మాట్లాడి ఇళ్లంతా అలకరించి.. కూతురికి సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఈ వేడుకలు ఒకెత్తు అయితే.. సుప్రిత పెంపుడు కుక్క (తన కొడుకు అట)బర్త్ డేను కూడా సెలెబ్రేట్ చేయడం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. కుక్కకు స్పెషల్ ఇన్ స్టాగ్రాం అకౌంట్ క్రియేట్ చేయడ, దానికి కూడా ఫాలోవర్స్ ఉండటం ఏంటో అని నెటిజన్లు చెవులు కొరుక్కున్నారు.

Surekha Vani Travelling Hyderabad To Jaipur
Surekha Vani Travelling Hyderabad To Jaipur

తాజాగా సురేఖా వాణి హైద్రాబాద్‌ను విడిచివెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన గ్యాంగ్‌ను మిస్ అవుతున్నా అంటూ ఎయిర్ పోర్ట్ వద్ద అందరికీ వీడ్కోలు పలికినట్టు తెలుస్తోంది. ఇక తన ఫ్లైట్ టికెట్ చూపిస్తూ హైద్రాబాద్‌కు బై అని తెలిపింది. ఆ టికెట్‌లో మాత్రం జైపూర్ వెళ్తున్నట్టు కనిపించింది. కానీ ఇప్పుడు ఆమె అక్కడికి ఎందుకు వెళ్తోంది అని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు.