ఓహో అలా రచ్చ చేస్తున్నారా.. పార్టీలో సురేఖా వాణి, హేమ, రాజా రవీంద్ర హల్చల్!!

టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్‌లందరూ తాజాగా ఒక చోటకు చేరిపోయారు. అందుకు ఒక కారణం కూడా ఉంది. అలా అందరూ సీనియర్ లేడీ ఆర్టిస్ట్‌లందరూ ఒక్క చోటకు చేరి సందడి చేస్తుంటే అందులో రాజా రవీంద్ర కూడా కనిపించాడు. మొత్తానికి ఇలా టాలీవుడ్ ఆర్టిస్ట్‌లందరూ కలిసికట్టుగా ఉంటే చూడటానికి కూడా బాగానే ఉంది. అసలు వీరందరూ కలుసుకోవడానికి కారణం నటి రజిత బర్త్ డే. ఈమె బర్త్ డేను అందరూ కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు.

Surekha Vani Sana And Hema In Tollywood Artist Rajitha Birthday

ఈ వేడుకలో హేమ, రాజా రవీంద్ర, సనా ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్‌లున్నారు. మామూలుగా అయితే వీరే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. అదే విధంగా ఈ వీడియోలను వారే బాగా హైలెట్ అయ్యారు. అయితే ఈ వేడుకలను, వారు చేసే అల్లరిని సురేఖా వాణి తన కెమెరాలో బంధించింది. ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. అంతకంటే ముందుగా అంటే ఉదయాన్నే నటి రజితకు బర్త్ డే విషెస్ తెలిపింది.

సురేఖా వాణి రజితతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే అక్క.. గాడ్ బ్లెస్ యూ.. నువ్ నాకెంత ప్రత్యేకమైన దానివో నాకు మాత్రమే తెలుసు. నువ్వే నా అతిపెద్ద బలం.. నాకు మద్దతుగా నిలిచేది కూడా నువ్వే… నువ్ నాకు అందించే ఆశీర్వాదాలకు థ్యాంక్స్ అక్క..లవ్యూ అక్కా ఓం సాయి రాం అంటూ చేతులెత్తి దండం పెట్టింది. రజిత అంటే అంత ప్రేమ ఉంది కాబట్టే బర్త్ డే వేడుకలను దగ్గరుండి మరీ నిర్వహించినట్టుంది.