ఈ వయసులోనూ ఎంత హాట్‌గా ఉంది.. సురేఖా వాణికి ఆ అలవాటు కూడానా?

సురేఖా వాణికి వయసుతో పాటు అందం కూడా పెరుగుతూ ఉన్నట్టుంది. ఎదిగిన కూతురు ఉన్నా కూడా సురేఖా వాణిది చెక్కు చెదరని అందం. ఇలా సీనియర్ ఆర్టిస్ట్‌ల్లో వయసుతో పాటు అందం పెరుగుతున్నది ఇద్దరికే. ప్రగతి, సురేఖా వాణి రోజురోజుకూ యంగ్‌గా మారిపోతున్నారు. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. కానీ ఇద్దరిదీ వేర్వేరు దారులు. కానీ ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫేమస్సే.

Surekha Vani Latest Pic While Enjoys In Party
Surekha Vani Latest Pic While Enjoys In Party

సురేఖా వాణి తన కూతురు సుప్రితతో చేసే రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ ఇద్దరూ కలిశారంటే అక్కడ రచ్చ రచ్చ కావాల్సిందే. మొన్నీమధ్యే కారులో ఓ ట్రిప్ వేశారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి కొండ పోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లి అక్కడ సందడి చేశారు. ఇలా ప్రతీ వారం బయటకు వెళ్లి వీకెండ్‌లో పార్టీలు చేసుకోవడం తల్లీ కూతుళ్లకు ఇష్టమే. మామూలుగా అయితే ఈ ఇద్దరూ విదేశాల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంటారు.

Surekha Vani Latest Pic While Enjoys In Party
Surekha Vani Latest Pic While Enjoys In Party

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడే తిరుగుతూ రచ్చ చేస్తున్నారు. సురేఖా వాణి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో సురేఖా వాణిని చూస్తూ అసలు పెళ్లి అయిందా? అనే అనుమానం వచ్చేలా ఉంది. టీ షర్ట్‌లో ఉన్న సురేఖా వాణి చూపుల్తోనే మత్తెక్కించేలా ఉంది. ఇక క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటిది ప్లాన్ చేసినట్టుంది. గ్లాసులో మందు లాంటిది ఏదో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ మధ్య ఓ శాంపైన్ బాటిల్ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇలా మందే కొట్టే అలవాటు కూడా సురేఖా వాణికి ఉన్నట్టుంది.