కూతురి ఫ్రెండ్ పార్టీ.. పబ్‌లో సురేఖా వాణి రచ్చ

Surekha vani In Supritha Friend Birthday Party

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి అని కాకుండా ఆమె కూతురు సుప్రిత కూడా దుమ్ములేపుతూ ఉంటుంది. తల్లీ కూతుళ్లు కలిసి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంటారు. అలా క్లబ్ పార్టీలు అయినా, పబ్‌లకు అయినా సరే ఎక్కడికైనా కలిసే వెళ్తుంటారు. ఆ మధ్య గోవా వెకేషన్స్‌లో ఈ తల్లీకూతుళ్లు చేసిన హల్చల్‌కు అంతా ఫిదా అయ్యారు.

Surekha vani In Supritha Friend Birthday Party
Surekha vani In Supritha Friend Birthday Party

అయితే నిన్న రాత్రి మాత్రం సురేఖా వాణి, సుప్రిత కలిసి గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. సుప్రిత తన ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేసింది. పాత ఫోటోలన్నీ షేర్ చేస్తూ తమ స్నేహ బంధాన్ని చాటుతూ పోస్ట్ చేసింది. పెండ్స్ ఈ అమ్మాయి బర్త్ డే.. విషెస్ చెప్పండి ఫ్రెండ్స్ అంటూ టిక్ టాక్ స్టైల్లో చెప్పింది. అయితే రాత్రి సుప్రిత ఫ్రెండ్ చేత కేక్ కట్ చేయించారు. అనంతరం అందరూ కలిసి రచ్చ చేశారు.

ఇక బర్త్ డే పార్టీ సందర్బంగా అందరూ కలిసి పబ్‌కు వెళ్లినట్టున్నారు. ఈ క్రమంలో వారితో పాటు సురేఖా వాణి కూడా వెంట వెళ్లింది. చిన్న పిల్లలా వారితో పాటు గంతులేస్తూపార్టీలో రచ్చ చేసింది. పబ్‌లో సురేఖా వాణి వేసిన గంతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి కూతురికే పోటీ వచ్చే అందంతో సురేఖా వాణి సోషల్ మీడియాలో నెటిజన్లను కట్టిపడేస్తోంది.