నైట్ పబ్ పార్టీలో రచ్చ.. గ్యాంగ్‌తో సురేఖ వాణి హల్చల్

Surekha vani Hema Raja Ravindra and Rajitha enjoy in party

సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా కూతురితో కలిసి ట్రావెల్ చేస్తుంటారు. ఈ ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్, క్లబ్‌లంటూ రచ్చ చేస్తుంటారు. ఒక వేళ తన కూతురు లేకపోతే సినీ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకుంటుంది. రాజా రవీంద్ర, రజిత, హేమ ఇలాంటి వారందరితో కలిసి బయట పార్టీలకు వెళ్తుంటుంది. ఈ అందరూ కలిస్తే అక్కడ సందడి వాతావరణమే ఉంటుంది.

Surekha vani Hema Raja Ravindra and Rajitha enjoy in party

ఆ మధ్య నటి రజిత బర్త్ డే సందర్భంగా అందరూ కలిశారు. పాత ఆర్టిస్ట్‌లందరూ కలిసి సందడి చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా రాజా రవీంద్ర మాత్రమే హైలెట్ అయ్యాడు. హేమ, సురేఖా వాణి వంటి తదితరులున్నా కూడా రాజా రవీంద్ర మీదే అందరి ఫోక్ వెళ్లిపోయింది. తాజాగా మళ్లీ ఈ గ్యాంగ్ అంతా కలిసి పబ్‌లో వీకెండ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేశారు. మొత్తంగా ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

న్యూ ఇయర్‌కు అందరూ కలుసుకోలేకపోవడంతో ఇలా ఈ ఆదివారం నాడు రచ్చ చేస్తున్నామని సురేఖా వాణి చెప్పుకొచ్చింది. నా డార్లింగ్స్ సురేఖా వాణి, హేమ, ప్రవీణ కడియాల, రాజా రవీంద్ర, నటి జయలక్ష్మీతో కలిసి ఆది వారాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాని రజిత చెప్పుకొచ్చింది. ఇక పబ్‌లో వీరు చేస్తున్న రచ్చకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నైట్ బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.