టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంది. ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడికి మకాం మార్చేసింది. ముందు ఓ పదిహేను రోజుల కోసం అక్కడికి వెళ్లింది. షూటింగ్ పూర్తి చేసుకుంది. మళ్లీ హైద్రాబాద్‌కు వచ్చింది. అయితే మళ్లీ షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లింది. అయితే ఈసారి తన కూతురు సుప్రితను కూడా తీసుకెళ్లింది. మామూలుగా ఈ మోడ్రన్ తల్లీ కూతుళ్లు చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే.
ఈ ఇద్దరూ కలిస్తే ఎక్కడైనా రచ్చ రచ్చే. ఇద్దరూ కలిసి విదేశాలుకు వెకేషన్స్‌కు వెళ్తుంటారు. తల్లీ కూతుళ్లలా కాకుండా.. ఫ్రెండ్స్‌లా ఉంటారు. ఇక ఈ ఇద్దరు కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తెల్ల పంచెలు కట్టుకుని నల్ల కళ్లద్దాలు పెట్టుకుని చేసిన టిక్ టాక్ ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఈ మధ్యే కూతురు బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేసింది. కూతురికి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఇళ్లంతా భారీగా డెకరేట్ కూడా చేయించింది.
ఆ బర్త్ డే వేడుకల్లో సుప్రిత కంటే సురేఖా వాణినే ఎక్కువగా హైలెట్ అయింది. అందంలో పోటీ పెడితే కూతురు కంటే ఎక్కువ మార్కులే సంపాదిస్తుంది. జీరో సైజ్ మెయింటేన్ చేస్తూ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారవుతోంది. తాజాగా షూటింగ్ నిమిత్తం రాజస్థాన్‌లోని హోటల్‌లో దిగారు ఈ తల్లీ కూతుళ్లు. అయితే హోటల్ రూంలో ఎక్కడా ప్లేస్ లేనట్టు ఈ బాత్రూంలో కూర్చుంది.. అంటూ కూతురి వీడియోను షేర్ చేసింది సురేఖా వాణి. ఇక్కడే లైటింగ్ బాగుందని వీడియో కాల్ చేసేందుకు వచ్చాను అంటూ చెప్పేసింది. అలా మొత్తానికి దొరికేయడంతో చేతులు అడ్డం పెట్టేసుకుంది.