Supritha: సినీ ప్రియులకు యాక్టర్ సురేఖ వాణి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ నటిగా , షో హోస్ట్‌గా ఇలా ఎన్నో రకాలుగా తెలుగు ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు సంపాదించుకుంది సురేఖా వాణి. మాటీవీలో మా టాకీస్ పేరుతో బుల్లితెరపై అడుగుపెట్టిన సురేఖ.ఆపై పల్లి షో లలో నటించి నటనలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సిల్వర్ స్క్రీన్ లో ఓ రేంజ్ లో ఎదిగింది సురేఖవాణి. ఇక మూడేళ్ల క్రితం సురేఖ వాణి భర్త చనిపోవడంతో సురేఖ వాణి తన కూతురు సుప్రియ తో కలిసి ఉంటుంది. ఇక సురేఖ తన కూతురు సుప్రీత తో సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తుంది.
ఇక తన తండ్రి చనిపోయిన సమయంలో వాళ్ళ బంధువుల ప్రవర్తనను బయట పెట్టింది సురేఖవాణి కూతురు. మా నాన్న చనిపోయినప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండేవి. ఇక మా నాన్న తరుపు బంధువుల నుంచి మాకు ఎలాంటి మద్దతు లేదు. ఇక డాడీ కి నేనే తలకొరివి పెట్టుకున్నా. డాడీ బంధువులు తలకొరివి పెట్టమని పిలిస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
డాడీకి తల కొరివి పెట్టాలని చెప్తే.. మీరు పెట్టేయండి మేము తర్వాత వస్తాం అన్నట్లు మాట్లాడారు. ఆ సమయంలో మాకు మా అమ్మ ఫ్యామిలీ వాళ్ళే మాకు తోడుగా ఉన్నారంటూ సురేఖ వాణి కూతురు ఎమోషనల్ అయ్యింది. ఇక సురేఖ వాణి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఆమె పాఠశాలలో చదువుకునేటప్పుడు.
అనేక సాంస్కృతిక మాధ్యమాలలో పాల్గొనేది. పెళ్లయిన తర్వాత మాటీవీలో భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనేక కార్యక్రమాలు చేసింది. అంతేకాకుండా తన భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి. ఇక సురేఖ వాణి కూతురు ఎమోషనల్‌గా స్పందించిన మాటలపై సురేఖ వాణి ఏమని స్పందిస్తుందో చూడాలి.