సింగర్ సునీత బాటలో సురేఖా వాణి అంటూ నిన్న కొన్ని వెబ్ సైట్స్ వార్తలు రాస్తూ మసాలాను దట్టించాయి. అయితే అందుకే ఆధారాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆమె ఎక్కడా కూడా అలాంటి హింట్ ఇవ్వలేదు. ఆమెకు ఇన్ స్టాగ్రాం తప్పా మరో అకౌంట్ లేదు. కానీ ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల్లో పేర్కొందంటూ కొందరు వార్తలు అల్లేశారు. రెండో పెళ్లికి సురేఖా వాణి సిద్దమైనట్టు రాసుకొచ్చిన వార్తలపై ఆమె ఫైర్ అయింది.
సునీత రెండో పెళ్లి చేసుకోవడం.. సురేఖా వాణికి కూడా ఈ ఆలోచన వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే వీటిపై సురేఖా వాణి సీరియస్ అయింది. ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖా వాణికి తనపై వచ్చే రూమర్లు, వార్తలు తెలియకుండా ఉంటుందా? తాజాగా ఆ వార్తలు, ఆ వార్తలు రాసిన వెబ్ సైట్స్ ఆమె కంట పడ్డాయి. వాటి స్క్రీన్ షాట్స్ తీసి ఇది తప్పుడు వార్తలు అని కొట్టి పారేసింది. అలా ఇంకో విషయంపైనా క్లారిటీ ఇచ్చింది.
నాకు ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ వంటివి ఏమీ లేవు.. కేవలం ఇన్ స్టాగ్రాం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చింది సురేఖా వాణి. మొత్తానికి ఇలా ఇప్పుడు ఈ వార్తలకు పుల్ స్టాప్ పడ్డట్టు అయింది. అయితే భవిష్యత్తులో ఆమె నిర్ణయం మారొచ్చునని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సురేఖా వాణి తన కూతురు సుప్రిత కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆమెను వెండితెరపైకి తీసుకురావాలని ట్రై చేస్తోంది. సురేఖవాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో 2019లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.