టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి అందరికీ తెలిసిందే. అందులోనూ మరీ ముఖ్యంగా ఆమె కూతురు సుప్రిత గురించి ఇంకా తెలిసే ఉంటుంది. ఎందుకంటే సురేఖా వాణి ఆమె కంటే తన కూతురు ఎక్కువగా ఫేమస్ అవ్వాలని, ఫోకస్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ సుప్రిత కంటే సురేఖా వాణి అందానికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. వయసు పెరుగుతున్నా సరే తరగని అందం సురేఖా వాణి సొంతం అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుంటారు.
సురేఖా వాణి తన కూతురు సుప్రితతో నిత్యం విదేశాలకు వెళ్తుంటుంది. అక్కడే వీధుల్లో తిరుగుతూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం బయటకు వెళ్లు చాన్స్ లేకపోవడంతో మన దేశం, మన రాష్ట్రంలోనే చక్కర్లు కొడుతోంది. గత నెలలో షూటింగ్ నిమిత్తం సురేఖా జైపూర్ వెళ్తే కూతుర్ని కూడా అక్కడికి తీసుకెళ్లింది. అక్కడ దర్గా అంటూ బాగానే తిరిగింది.
అక్కడి నుంచి హైద్రాబాద్ వచ్చాక.. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను వీక్షించడానికి కారులోనే వెళ్లారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. తాజాగా వీరిద్దరూ దసరా స్పెషల్‌గా గోవాకు వెళ్లినట్టు కనిపిస్తోంది. అంజునా బీచ్ అంటూ సురేఖా వాణి ఓ పోస్ట్ చేసింది. ఆ తరువాత టిటోస్ నైట్ క్లబ్ అనే పబ్‌లో కనిపించారు. ఈ మేరకు వారు పోస్ట్ చేసిన వీడియో బాగానే వైరల్ అవుతోంది. అయితే ఈ పబ్‌కు వెళ్లేందుకు తల్లీ కూతుళ్లు రెడీ అయిన తీరు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.