టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య వెండితెరపై కంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కూతురు సుప్రితతో కలిసి సురేఖా వాణి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మామూలుగా అయితే ఆ దేశం ఈ దేశం అంటూ తిరిగేవారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మన దేశం లోపలే తిరిగేస్తున్నారు. గత నెలలో షూటింగ్ నిమిత్తం రాజస్తాన్, జైపూర్‌లో సందడి చేశారు.
హైద్రాబాద్‌కు వచ్చాక క్లబ్, పబ్బులు, రిజర్వాయర్లు అంటూ తమ గ్యాంగ్‌తో తిరిగి రచ్చ చేశారు ఈ మోడ్రన్ తల్లీ కూతుళ్లు. ఇప్పుడు ఇంకో వేరే లెవెల్‌లో హల్చల్ చేస్తున్నారు. దసరా రోజు ఇంటి పట్టున ఉండి పూజలు పునస్కారాలు చేయాల్సింది పోయి గోవా బీచ్‌లో, పబ్బులో చిందులు వేశారు. ఈ ఇద్దరూ కలిసి గోవాలోనే ఉంటున్నారు. దసరాకు వెళ్లారు. ఇంకా తిరిగి రానట్టే కనిపిస్తోంది.
ఇక గోవాలో చేసే రచ్చకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ హల్చల్ చేశారు. ఈ తల్లీ కూతుళ్లిద్దరూ చిన్న పిల్లల్లా మారి స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడారు. వాటికి సంబంధించిన వీడియోను సుప్రిత షేర్ చేసింది. తాజాగా సురేఖా వాణి ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో కొన్నింటిని చూసి జనాలు షాక అవుతున్నారు. సురేఖా వాణి హాట్ డ్రెస్సులో చేతిలో మందు పట్టుకుని కూతురితో ఎంజాయ్ చేస్తోంది. వెనకాల ఆ సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉండగా.. వీరి రచ్చతో హీటెక్కేలా కనిపిస్తోంది.