వెండితెరపై కొంత మంది నటీనటులు నిత్యం కలిసి నటిస్తుంటారు. అలా కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎక్కువగా రిపీట్ అవుతుంటారు. కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు, దర్శకులు, నిర్మాతలు పేరు కనిపిస్తే అందులో కొంత మంది నటీనటులు ఫిక్స్ అయిపోయి ఉంటారు. అలా ప్రతీ సారి రిపీట్ అవ్వడం కలిసి నటించడంతో వారి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడుతుంటుంది. అలా హేమ, సురేఖా వాణి, నటి రజితల మధ్య మంచి రిలేషన్ ఉంది.
అయితే ఆ మధ్య హేమ, సురేఖా వాణిల మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం వంటివి పూర్తిగా తగ్గిపోయాయి. ఈ విషయంపై హేమ కూడా మీడియాలోని ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. సురేఖా వాణి వ్యవహారం నచ్చలేదని, తన గురించి తన వెనకాల మాట్లాడుతుందని అలా చిన్న చిన్న గొడవలు వచ్చాయని హేమ తెలిపింది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటివేమీ లేవని తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కువగా కలిసి పార్టీలు చేసుకుంటున్నారు.
ఆ మధ్య నటి రజిత బర్త్ డే పార్టీల్లోనూ హేమ, సురేఖా వాణి కలిసి సందడి చేశారు. నాటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లందరూ కలిస్తే గోలగోలగా ఉంటుంది. ఆ మధ్య పబ్‌లో న్యూ ఇయర్ పార్టీలు గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక తాజాగా హేమ పెళ్లి రోజును కూడా గ్రాండ్‌గానే నిర్వహించినట్టు కనిపిస్తున్నారు. సురేఖా వాణి స్పెషల్‌గా హేమను విష్ చేసింది. జాన్ బావ, హేమకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని తెలిపింది. ఇక తనీష్, నటుడు రవి ప్రకాష్, రజిత, రాజా రవీందర్ వంటి వారంతా కలిసి సందడి సందడి చేశారు.