Prabhas: టాలీవుడ్ హీరో డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇకపోతే ప్రభాస్ నటించిన సినిమాలలో రాజా సాబ్ సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా విడుదల కానున్నాయి.
ఈ సినిమా తరువాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేయనున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఎలాంటి సునామీ సృష్టించనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్ లొకేషన్స్ కూడా ఫిక్స్ చేస్తున్నాడట. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదోక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిటంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 5 నుంచి స్టార్ట్ కానుందట. అలాగే ఈ చిత్రంలో మలయాళీ భామ మడొన్నా సెబాస్టియన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని టాక్. దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. ఇందులో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్నాడట. అయితే బాలీవుడ్ లో హీరోగా అనేక చిత్రాల్లో మెప్పించిన వివేక్ ఇప్పుడు స్పిరిట్ చిత్రంలో విలన్ పాత్రలో నటించనున్నాడట. ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ పాత్రలలో నటించారు వివేక్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్త సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.
Prabhas: ప్రభాస్ మూవీలో విలన్ గా బాలీవుడ్ నటుడు.. అంచనాలు పెంచేస్తున్న సందీప్ రెడ్డి వంగా?
